అత్యాచార ఫుటేజ్ వీడియోలు చూపించండి: జూయ్ బిస్వాస్

అత్యాచార ఫుటేజ్ వీడియోలు చూపించండి: జూయ్ బిస్వాస్

వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ అధికార ప్రతినిధి జూయ్ బిస్వాస్ ఓ డిబెట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో టీఎంసీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గతకొద్ది రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  జనవరి మొదటి వారంలో టిఎంసి నేత షాజహాన్ షేక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు నిర్వహించింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈడీ రైడ్స్ తర్వాత చాలా మంది మహిళలు షాజహాన్, అతని అనుచరులపై లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులతో టీవీలో చర్చ పెట్టారు.  

డిడి ఛానల్ లో 5కి పంచాయత్ అనే ఓ డిబెట్ లో టీఎంసీ స్పోక్స్ పర్సన్, మహిళా అధికార ప్రతినిధి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బాధితుల ఆరోపణలను ఖండిస్తూ డిబెట్ లో ఉన్న ఇతర వక్తలను ప్రశ్నించింది. జూయ్ బిస్వాస్ మాట్లాడుతూ.. హత్రాస్ లో అత్యాచారం జరిగిందని రుజువైంది. వెస్ట్ బెంగాల్ లో అత్యాచారం జరిగిందని ఆధారాలేంటని.. తనకి అత్యాచారం జరిగినట్లు వీడియో చూపించాలని యాంకర్ ని ప్రశ్నించింది. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో కొందరు జర్నలిస్టులు వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.